తడబడ్డ భారత్... రాహుల్‌-ధావన్‌ ఔట్...

SMTV Desk 2017-11-16 14:40:25  kolkatha, india-sri lanka test, india loss 2 wickets, match stopped

కోల్‌కతా, నవంబర్ 16 : లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు ఓపెనర్లు తడబడ్డారు. ఇన్నింగ్స్ ఆదిలోనే లంక బౌలర్‌ సురంగ లక్మల్‌ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ రాహుల్‌ ఔటయ్యాడు. తర్వాత ఆరో ఓవర్ లో లక్మల్ వేసిన బాల్ కి ధావన్ క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు చేరాడు. భారత్ 8.2 ఓవర్లలో 17 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ‌, పుజారా ఉన్నారు. ఇంతవరకు సునీల్‌ గావస్కర్‌(3 సార్లు), సుధీర్‌ నాయక్‌, డబ్ల్యూవీ రమన్‌, ఎస్‌ఎస్‌ దాస్‌, జాఫర్‌, మాత్రమే కేఎల్‌ రాహుల్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో తొలి బంతికి ఔటైన ఆటగాళ్లు జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఆటను వర్షం కారణంగా అంపైర్లు నిలిపివేశారు.