వధువు కోరిక మేరకు షారుక్ హెలికాప్టర్ లో...

SMTV Desk 2017-11-16 14:35:01  jaipur wedding, rajasthan, sharukh , sharuk khan.

జైపూర్, నవంబర్ 16: ప్రతి అమ్మాయి తనకు రాజకుమారుడు లాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి దాంతో పాటు ఓ విచిత్రమైన కోరికను కోరుకుంది. అది ఏంటంటే... తనను పెళ్లి చేసుకోబోయేవాడు పెళ్లి మండపానికి హీరోలా హెలికాప్టర్‌లో రావాలని కోరింది. వధువు అడగడమే ఆలస్యం వరుడు కోరిక నెరవేర్చాడు. వివరాల్లోకి వెళితే... జైపూర్‌కి చెందిన షారుక్‌ అనే వ్యక్తికి ఉత్తరప్రదేశ్‌కి చెందిన తాన్జిమ్‌తో వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలో తాన్జిమ్‌ ఈ కోరిక కోరింది. వీరిద్దరి వివాహం బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. తాన్జిమ్‌ కోసం అనుకున్నట్లుగానే మండపానికి హెలికాప్టర్‌లో వచ్చాడు. అంతేకాదు వివాహ తంతు ముగిసిన తర్వాత కూడా నూతన వధూవరులు అదే హెలికాప్టర్‌లో జైపూర్‌ బయలుదేరారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు మండపం వద్ద భారీగా జనం గుమిగూడారు.