ఇకపై రెస్టారెంట్లలో భోజనం మరింత చౌక..

SMTV Desk 2017-11-16 12:54:13  The reduced GST prices in restaurants, Input tags credit, GST Council

న్యూఢిల్లీ, నవంబర్ 16 : ఇకపై రెస్టారెంట్లలో భోజనం మరింత చౌక ధరలకే రానుంది. రెస్టారెంట్లలో జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకు౦ది. ఈ మేరకు గువాహటిలో జీఎస్టీ కౌన్సిల్ 23వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రెస్టారెంట్లపై విధించిన 18 శాతం జీఎస్టీని 5 శాతానికి కుదించారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలో మాత్రం రెస్టారెంట్లకు ఎటువంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఐటీసీని వినియోగదారులపై మోపకుండా దానిని రెస్టారెంట్ యజమానులే భరించేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చారు. కేవలం వినియోగదారులు తిన్న ఆహార పదార్థాలపై మాత్రమే ఈ జీఎస్టీని విధించేలా నిబంధనలను సవరించారు. కాగా తాజా నిబంధన నేటి నుంచే అమల్లోకి రానుంది. ఫలితంగా రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు చౌక కానున్నాయి.