మెగా ఫ్యామిలీపై కత్తి మళ్లీ కామెంట్ చేశాడు..

SMTV Desk 2017-11-16 12:46:04  pawan kalyan, katti mahesh, nandi award issue, megha family.

హైదరాబాద్, నవంబర్ 16: ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు తమ రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అవార్డుల ప్రకటనల అనంతరం మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి బన్నీ వాసు వ్యాఖ్యానించగా... ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ హెద్దేవ చేశారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ గతంలో కొన్ని కామెంట్స్ చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఈ అవార్డుల విషయంలో ‘అయినా కమ్మోళ్ళ రాజ్యంలో కాపులకు ఎందుకండి అవార్డులు!!! మీ కాపు సామ్రాజ్యం పవన్ కళ్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా? మెగా ఫ్యామిలికి అప్పుడు పంచుకొండి పప్పులు బెల్లాలు’ అంటూ తన పేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై మెగా అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.