నటి భువనేశ్వరి కొడుకు పెళ్లి కేసు కీలక మలుపు...

SMTV Desk 2017-11-16 12:38:21  Bhuvaneshvari, Midhun Srinivasan, chennai, police,

చెన్నై, నవంబర్ 16: తెలుగు చలన చిత్ర నటి భువనేశ్వరి, ధారావాహికలతో పాటు పలు సినిమాలలో కూడా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తూ, పలు వివాదాలపై తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె కుమారుడు మిథున్ శ్రీనివాసన్ చెన్నైలోని ఓప్రైవేటు లా కాలేజ్ లో న్యాయశాస్త్రం (ఎల్ఎల్ బీ) విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇటీవల మిథున్ శ్రీనివాసన్ ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువతిని నిత్యం వేధి౦పులకు గురి చేస్తున్నాడని ఐపీసీ సెక్షన్ 354 (B), 448, 427, 506, తమిళనాడు మహిళా వేధింపుల చట్టం సెక్షన్ 4 కింద చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది. భువనేశ్వరి తమ ఇంట్లో పని చేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువతిని పిలిపించుకొని తన కుమారుడితో పెళ్లి చేసి౦దట. ఆపై కొడుకుతో కలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్టు ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది.