శుభారంభం అదిరింది...

SMTV Desk 2017-11-16 12:15:31  china open series, p. v sindhu, saina nehwal, h.s pranay, india

చైనా, నవంబర్ 16 : చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత్ మాజీ చాంపియన్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ శుభారంభం చేశారు. నిన్న జరిగిన మహిళా సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధు 24–22, 23–21తో సయాకా సాటో (జపాన్‌)పై చెమటోడ్చి గెలుపొందగా, సైనా తొలి రౌండ్ ని 21–12, 21–13తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా 18-21, 21-16, 21-19తో లీ డాంగ్‌ క్యున్‌ (కొరియా) కష్టపడి నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. . గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్‌)తో సైనా, హాన్‌ యుయి (చైనా)తో సింధు తలపడనున్నారు.