గ్రోసరీ మార్కెట్ వైపు...అంబానీ చూపు..

SMTV Desk 2017-11-16 11:53:39  jiyo, grocery market, mukesh ambani, reliance

న్యూఢిల్లీ, నవంబర్ 16 : జియో తో టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ అధినేత, ముకేష్ అంబానీ చూపు ప్రస్తుతం కిరాణా మార్కెట్ వైపు పడిందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. మొబైల్ రంగంలో మిగతా కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన అంబానీ, మార్కెట్‌ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఇప్పుడు తాజాగా జియో వినయోగాదారుల బేస్ తో, గ్రోసరీ మార్కెట్లోనూ అడుగుపెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుత భారత్ లో విదేశీ కంపెనీలు ఆన్‌లైన్‌ వేదికగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు వేల కోట్ల రూపాయలతో పోటీ పడుతున్నాయి. అందుకు భిన్నంగా తయారీ దారులు, కిరాణా దుకాణాలను జియో కస్టమర్లతో అనుసంధానం చేయాలన్నది ముకేష్ వ్యూహ రచన. ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టు మొదలైంది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని జియో అధినేత భావిస్తున్నారు. అంబానీ జియో తో మరల సంచలనాలను సృష్టిస్తారో లేదో కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.