పడవ బోల్తా కేసులో పర్యాటక శాఖ అధికారి...

SMTV Desk 2017-11-16 11:36:51  boat accident, krishna river, vijayawada, cp goutham savang

విజయవాడ, నవంబర్ 16: విహార యాత్రకు అని పయనమైన వారు అనంత లోకాలకు వెళ్లారు. ఈ నెల 13వ తేదిన కృష్ణ నది ఫెర్రి వద్ద బోటు బోల్తా పడి 30 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అఖిల ప్రియ, పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఒకొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బోటు బోల్తా పడటానికి కారణం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యమేనని సీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తెర ముందు కనిపించకుండా పర్యాటక శాఖ అధికారి కొల్లి శ్రీధర్, రివర్ బోటింగ్ సంస్థను కొండల రావు అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని అసలు విషయాన్నీ వెల్లడించారు. పెట్టుబడులు కొల్లి శ్రీధర్ వంతు, పాట్లు కొండల రావు వంతు ఇలా ఇద్దరు కలిసి అనుమతులు లేకుండా బోటును నడపడమే కాకుండా, 20 మందిని కంటే ఎక్కువ ఎక్కడానికి వీలు లేని ఆ బోటులో 38 మందిని ఎక్కించి మరి చంపారు. వీరిని కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువులు, సన్నిహితులు పోలీసులను కోరారు.