భూమికి సమీపంలో మరో కొత్త గ్రహం..

SMTV Desk 2017-11-16 10:58:40  Scientists found Another planet, Ross 128 b,

వాషింగ్టన్‌, నవంబర్ 16 : అచ్చం భూమిని పోలి ఉన్న మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం భూమికి సమీపంలోనే ఉందని, అక్కడ జీవన౦ సాగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇది భూమికి 11 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అనగా దగ్గర్లో ఉన్నట్లేనని శాస్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరిమాణంలో ఈ గ్రహం భూమి కంటే కాస్త పెద్దదిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ గ్రహానికి "రాస్ 128 బి" అనే పేరు పెట్టారు.