ఒంటె మాంస౦ అక్రమ రవాణా...

SMTV Desk 2017-11-16 10:35:51  Camel meat, munugodu, nalgonda,

మునుగోడు, నవంబర్ 16: మండలంలో ఒంటె మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న దుండగులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామ శివారులోని నిమ్మల స్వామి అనే రైతు వ్యవసాయ భూమికి బుధవారం అర్ధరాత్రి సమయంలో రెండు లారీల్లో 26 ఒంటెలను కొందరు వ్యక్తులు లారీలో తీసుకొచ్చారు. అందులో 21 ఒంటెలను వధించి ఆ మాంసాన్ని డీసీఎంలో తరలించేందుకు సిద్ధం చేశారు. మిగతా 5 ఒంటెలను కోసే క్రమంలో పోలీసులు దాడులు చేయడంతో గుట్టురట్టయింది. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటెలను హరియాణా నుంచి తీసుకొచ్చారు. ఈ దాడుల్లో 2 లారీలు, 3 డీసీఎంలు, 2 కార్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.