నేడే భారత్- శ్రీలంక మధ్య తొలి టెస్ట్...

SMTV Desk 2017-11-16 10:19:02  srilanka- india test match, kolkatha, mathews, south africa

కోల్‌కతా, నవంబర్ 16 : ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లి సేన, శ్రీలంకతో మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను ఈ రోజు కోల్ కతా వేదికగా తలపడనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ జట్టును లంకేయలు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం. శ్రీలంక జట్టులో మాధ్యుస్ తప్ప మిగతా ఆటగాళ్లందరూ కూడా అనుభవం లేని వారే. అయితే పాక్ తో సిరీస్ గెలిచిన లంక అదే ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుంది. భారత్‌లో ఆడిన శ్రీలంక 17 టెస్టుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. 10 ఓడిన ఆ జట్టు మరో 7 డ్రా చేసుకుంది. ముఖ్యంగా భారత్ జట్టు కఠినమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ సిరీస్‌ను కోహ్లీసేన సన్నాహకంగా మలుచుకోవాలనుకుంటోంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ రోజు 9.30 నుండి మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా టాస్ వేయలేదు.