విడుదలైన టీఎస్ టెట్-2017 నోటిఫికేషన్

SMTV Desk 2017-06-11 16:55:14   The release of TS TET-2012 notification

హైదరాబాద్, జూన్ 11 : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరిక్ష-2017 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర సమాచారాన్ని ఈ నెల 12 నుంచి టీఎస్ టెట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు. జూలై 23న టెట్ నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు ప్రకటించనున్నారు.