ఇలా కూడా విజయం సాధించవచ్చా...

SMTV Desk 2017-11-15 16:44:27  test match, in london, rare record, sarre, middle sex

న్యూఢిల్లీ, నవంబర్ 15 : సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో ప్రతి జట్టు రెండు ఇన్నింగ్స్ లు ఆడుతుంది. ఒక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ప్రత్యర్ధికి అవకాశం ఇస్తుంది. కానీ ఒక జట్టు తొలి ఇన్నింగ్స్ లో పూర్తి గా పరుగులేమి చేయకుండా డిక్లేర్‌ చేసింది. అంతే కాదు ఏకంగా మ్యాచ్ ను గెలిచింది. అదేలా అనుకుంటున్నారా అయితే చదవండి... క్రికెట్ కు పుట్టినిల్లయిన లండన్ లో ఈ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది.1977 సంవత్సరంలో కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్సెక్స్‌, సర్రే జట్ల మధ్య మూడు రోజుల మ్యాచ్‌ నిర్వహించారు. తొలుత టాస్ గెలిచి మిడిల్సెక్స్‌ సారథి మైక్‌ బ్రేయర్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణం వల్ల తొలి రోజు ఆట అసలు జరగలేదు. రెండో రోజు కూడా వరుణుడు అంతరాయం కల్పించడంతో, ఆట ముగేసి సమయానికి సర్రే జట్టు వికెట్‌ నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక మిగిలిన ఒక్క రోజులో మ్యాచ్ ఫలితం తేలదని భావించారు కానీ మిడిల్సెక్స్‌ విజయం సాధించడంతో అందరు ఆశ్చర్యపోయారు. మిడిల్సెక్స్‌ బౌలర్ డానియల్‌ పదునైన బంతులకు సర్రే ఆటగాళ్లు 22.5 ఓవర్లలో, 49 పరుగులకే కుప్పకూలిపోయారు. దీంతో రంగంలోకి దిగిన మిడిల్సెక్స్‌ జట్టు సారధి తెలివిగా అలోచించి ఒక బంతి పడగానే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టు మరోసారి డేనియల్ దెబ్బకు 89 పరుగులకే అల్ ఔటైంది. లక్ష్యం చేధనలో బరిలోకి దిగిన మిడిల్సెక్స్‌ 25.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 142 పరుగులు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. క్రికెట్ చరిత్రలో ఇది తిరుగులేని విజయంగా నిలిచింది.