23 వేల మంది ఉగ్రవాదులకై గాలింపు

SMTV Desk 2017-05-28 17:05:30  britan,terror in britan,manchestar,salman abedi

బ్రిటన్, మే 26 : ప్రపంచానికే దశ, దిశగా వ్యవహరించే బ్రిటన్ లో ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తత తీవ్రమైంది. దేశంలోని పారిశ్రామిక ప్రాంతమైన మాంచెస్టర్ లో గత వారం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాద చర్యతో ఉలిక్కిపడిన ఆ దేశం, పేలుళ్ళకు పాల్పడిన సల్మాన్ అబేది ఫూటేజ్ను విడుదల చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశ నిఘా సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం 23 వేల మంది ఉగ్రవాదులు ఆ దేశంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అందులో 3 వేల మంది ద్వారా తీవ్రమైన అపాయం తలెత్తే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో బ్రిటన్ పోలీసులు రంగంలోకి దిగి అరెస్టుల పర్వం ప్రారంభించారు.