మార్కెట్ లోకి ఫ్లిప్‌కార్ట్‌ ఫోన్‌ ...

SMTV Desk 2017-11-15 15:32:41  flip kart, billion capture plus, android phone, smart phone

న్యూఢిల్లీ, నవంబర్ 15 : ప్రస్తుతం ఎక్కడ చూసిన స్మార్ట్ ఫోన్ ల హవా కొనసాగుతుంది. మొబైల్ సంస్థలు కూడా వినయోగాదారుల వాడకం దృష్ట్యా సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘బిలియన్‌ క్యాప్చర్‌ ప్లస్‌’ పేరుతో బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. రెండు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ 3జీబీ ర్యామ్‌, 32జీబీ అంతర్గత మొమరీ ఫోన్‌ ధర రూ.10,999గా ఉండగా, 4జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మొమరీ మోడల్‌ ధర రూ.12,999గా సంస్థ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ విడుదల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 5.5 అంగుళాల తాకే తెర, 8 మెగాపిక్సల్‌ ముందు కెమెరా, 13 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా, 625 అక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రొసెసర్‌,3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, నూగట్‌ ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌, ఫీచర్ల ను కలిగి ఉంది.