త్వరలో తండ్రి కాబోతున్న మిస్టర్ బీన్..!

SMTV Desk 2017-11-15 14:46:46  Mr. Bean Web series, actor Rowan Atkinson, going to be Father.

ముంబై, నవంబర్ 15 : తన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా "మిస్టర్ బీన్" వెబ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోవర్ అట్కీన్సన్ మూడోసారి తండ్రి కాబోతున్నట్లు సమాచారం. 62 ఏళ్ళ రోవర్ 33 ఏళ్ళ లూయిస్ ఫోర్డ్ తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో కనిపించిన లూయిస్.. గర్భవతి అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రోవర్ కు ఇదివరకే 25 కుమారుడు, 21 ఏళ్ళ కూతురు ఉన్నారు. అయితే ఈ విషయంపై వారిద్దరి నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.