అర్ధాంతరంగా ముగిసిన బెలూన్ ఫెస్టివల్..

SMTV Desk 2017-11-15 14:28:39  Hot Air Balloon Festival is out late, all over 13 countries attended.

విశాఖ, నవంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అర్ధాంతరంగా ముగిసింది. నిన్న అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్ లో పాల్గొనడానికి మొత్తం 13 దేశాల‌కు చెందిన ఔత్సాహికులు హాజ‌ర‌య్యారు. అయితే వర్షం పడి వాతావరణం పూర్తిగా అనుకూలించక పోవడంతో ఈ బెలూన్ ఫెస్టివల్ ను నిలిపివేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను నిలిపివేయడంతో నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.