ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని యూసీ బ్రౌజ‌ర్..

SMTV Desk 2017-11-15 12:56:12  UC Browser, does not appear, Google Play Store.

న్యూఢిల్లీ, నవంబర్ 15 : ప్రపంచ వ్యాప్తంగా యూసీ బ్రౌజ‌ర్ ను 500 మిలియ‌న్ల మందికి పైగా ఉప‌యోగిస్తున్నారు. అలాంటి మొబైల్ ఇంటర్నెట్ స‌ర్ఫింగ్ అప్లికేష‌న్, గూగుల్ ప్లే స్టోర్‌లో క‌నిపించ‌డం లేదు. ఈ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను ఆండ్రాయిడ్ సెంట్ర‌ల్ అనే టెక్నిక‌ల్ మేగ‌జైన్ వెల్ల‌డించింది. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొని తన ఇష్టం వచ్చినట్లు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ల‌ను ఇస్తుంద‌ని పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజ‌ర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొల‌గించింద‌ని వెల్లడించింది. ఈ విషయాన్ని యూసీ బ్రౌజ‌ర్ ఉద్యోగి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో.. యూసీ బ్రౌజ‌ర్‌ను ప్లేస్టోర్ నుంచి 30 రోజుల పాటు తొల‌గిస్తున్న‌ట్లు ఈ మెయిల్ వచ్చినట్లు వివరించాడు.