మూడు రోజులు @ లక్ష పెళ్ళిళ్ళు

SMTV Desk 2017-11-15 12:13:16  1 lakh marriages in 3 days, 22, 23, 24 days are the forerunners.

హైదరాబాద్, నవంబర్ 15 : వివాహ వేడుక అంటే అదొక పెద్ద హంగామా.. అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల మధ్య జరిగే ఈ వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలవి. అలాంటిది ఈ నెలలో జరిగే పెళ్లిల విషయంలో పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పెళ్ళికి కేవలం మూడు రోజులు.. అనగా 22, 23, 24 వ తేదీలలో మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఈ మూడు రోజుల్లోనే లక్ష వివాహాలు జరగనున్నాయి. ఇందుకోసం అప్పుడే ఫంక్షన్ హాళ్ల వేట మొదలైంది. ఆగష్టు తర్వాత మళ్ళీ ఈ నెలలోనే ముహుర్తాలుండడంతో పురోహితులకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ నెల తప్పితే మళ్ళీ ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ఉండడంతో పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. పెళ్ళికి కావలసిన ప్రతి పనికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. తక్కువ సమయంలో అన్ని సమకూర్చుకోవడం వెడ్డింగ్ ప్లానర్లకు కూడా కష్టంగానే మారింది. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో అందరు ఈ మూడు రోజుల్లోనే పెళ్ళిళ్ళు చేసేందుకు సిద్దమయ్యారని పండితులు చెబుతున్నారు.