సొరాబ్జీ కు గూగుల్ ప్రత్యేక డూడుల్...

SMTV Desk 2017-11-15 11:39:08  Cornelia Sorabji, Indian woman, several firsts, mumbai

ముంబై, నవంబర్ 15 : నేటి సమాజంలో ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన, మహిళలను చదివించాలంటే ప్రతి ఒక్కరు ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే తెల్ల దొరల పాలన కాలం నాటి పరిస్థితి ఎంత దారుణం గా ఉండేదో...! అంతటి విపత్కర సమయంలో కూడా మొదటి మహిళా న్యాయవాది గా పేరుతెచ్చుకున్న ఘనత కార్నేలియా సొరాబ్జీ సొంతం. అంతే కాకుండా బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మొదటి మహిళా పట్టభద్రురాలుగా, 1889 లో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించిన మహిళగా గుర్తింపు పొందారు. ప్రస్తుత ముంబైకి చెందిన నాసిక్ లో 15 నవంబరు 1866 సం.లో జన్మించిన సొరాబ్జీ బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో చదివిన మొదటి మహిళగా కూడా చరిత్ర సృష్టించారు. ఇంతటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని పురష్కరించుకొని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సొరాబ్జీ కోసం ఒక ప్రత్యేకమైన డూడుల్ ని విడుదలచేసింది.