అమెరికాలో మరోసారి కాల్పుల మోత..

SMTV Desk 2017-11-15 10:37:45  firing in California, Rancho Tohama School, Kevin is an old man.

కాలిఫోర్నియా, నవంబర్ 15 : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి దుండగుడు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి కంటికి కనిపించిన వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాలిఫోర్నియా గ్రామీణ ప్రాంతంలోని రాంచో తోహమా అనే స్కూల్ పై దుండగుడు కాల్పుల వర్షం కురిపి౦చాడు. కేవలం స్కూల్ పైనే కాకుండా వేర్వేరు చోట్ల కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కాని అతను మరింత రెచ్చిపోవడంతో పోలీసులు అతడిని కాల్చి చంపేశారు. కాగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తి కెవిన్ అనే వృద్ధుడిగా గుర్తించారు. ఎందుకు కాల్పులు జరిపాడో మాత్రం తెలియరాలేదు. గాయపడ్డ వారిలో స్కూల్ పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.