జడ్డు భాయ్ కి అగ్రస్థాన అవకాశం...

SMTV Desk 2017-11-15 10:37:34  jadeja test rankings, icc, kohli, india-sri lanka

దుబాయ్, నవంబర్ 15 : శ్రీలంక తో ఈ నెల 16 జరగబోయే మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ బౌలర్ జడేజా రాణిస్తే తన ర్యాంకు ను మెరుగుపరుచుకొని, అగ్రస్థానం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో అతడు బౌలర్‌, ఆల్‌రౌండర్ల విభాగంలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 32 టెస్టులాడిన జడేజా 155 వికెట్లతో పాటు 1136 పరుగులు చేశారు. ఇంతక ముందు జడ్డు భాయ్ సెప్టెంబరులో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుత టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రన్ మెషిన్ కోహ్లి(806)పాయింట్లు తో 6 వ స్థానంలో ఉన్నారు. 5 వ స్థానంలో గల ఆసీస్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్(807)‌- కోహ్లీ మధ్య వ్యత్యాసం కేవలం పాయింట్‌ మాత్రమే. కావున విరాట్ టాప్‌-5లో చోటు దక్కించుకోవడం ఖాయం.