ఇటలీ ఇక ఇంటికే...

SMTV Desk 2017-11-15 10:11:18  italy, world cuo foot ball match, not qualified, milan

మిలాన్, నవంబర్ 15 : ప్రపంచ కప్ చరిత్రలో 1958 తర్వాత ఇటలీకి మరో షాక్.. వచ్చే ఏడాది రష్యా వేదికగా జరిగే ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు అర్హత పొందాలంటే స్వీడన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ జట్టు 0–0 ‘డ్రా’తో సరిపెట్టుకుంది. తమ సొంత గడ్డ పై వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఇటలీ జట్టు అవమానభారంతో ఇంటి ముఖం పట్టింది. ప్రపంచ కప్ ఫుట్ బాల్ అంటే ఇటలీ దేశం ముందు వరుసలో నిలబడుతుంది. అలాంటి జట్టు ఒక మెగా టోర్నీ కి అర్హత సాధించకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం ఇటలీ గోల్‌కీపర్‌ గియాన్లుగి బఫన్‌, డిఫెండర్‌ ఆండ్రియా బర్జాగ్లి, మిడ్‌ఫీల్డర్‌ డానియల్‌ డి రోసీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.