ఇది స్ప్రింగ్ యాక్షన్ గురూ...!

SMTV Desk 2017-11-14 12:43:17  kothiti goda, srilanka crickter, under-19, bowling action

కొలంబో, నవంబర్ 14 : భారత్ క్రికెట్ లో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతే కంటే తమ బౌలింగ్ లో వైవిద్యత చూపిన వాళ్ళలో ముఖ్యంగా పాల్ ఆడమ్స్ కోసం చెప్పు కోవాలి. ఎందుకంటే కనీసం పిచ్ ఎక్కడో చూడకుండా, అతనెలా బౌలింగ్ చేస్తున్నాడో చూస్తే అందరు కంగుతినేవారు. ఇప్పుడు మరల అదే తరహా బౌలింగ్ విధానంతో శ్రీలంకకు చెందిన కుడిచేతి వాటం స్పిన్నర్‌ కెవిన్‌ కాధ్‌ధిగోడ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మలేసియాలో జరుగుతున్న అండర్‌-19 ఆసియా కప్‌లో కెవిన్‌ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని శైలిని చూస్తే పాల్‌ అడమ్స్‌, శివిల్‌ కౌశిక్‌ గుర్తుకొస్తున్నారని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మిస్టరీ స్పిన్నర్ భవితవ్యం ఏంటో కాలమే నిర్ణయిస్తుంది.