లెక్కల్లో లేని ఆస్తుల విలువ రూ.1,430 కోట్లు

SMTV Desk 2017-11-14 12:12:32  Income tax department, chenai, shashikala it search

చెన్నై, నవంబర్ 14 : తమిళనాడులో ఐదు రోజులుగా శశికళ ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ. 1,430 మేర లెక్కలో చూపని ఆస్తులు బయట పడ్డాయి. మొత్తం 187 ప్రదేశాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించిన అధికారులు 350 మందికి పైగా వ్యక్తులను విచారించారు. పెద్దమొత్తంలో నగదు 15 కేజీలా వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దస్తావేజుల ఆధారంగా ఆస్తులు కొనుగోలు చేసేందుకు శశికళ కుటుంబీకుల ఆదాయ మార్గాలు, ఆస్తులకు సంబంధించి పన్ను చెల్లింపులు సక్రమంగా చేపట్టారా లేదా అన్న విషయాలను ఆరాతీశారు. ఆదాయపన్ను సోదాలో ఆస్తులకు సంబంధించి బినామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లో పనిచేసే వారు కూడా వ్యక్తిగత సహాయక పేర్లతో బినామీ ఆస్తులు కొన్నట్లు తేల్చారు. వారందరిని విచారించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు సందేహాలు ఉన్న వారు చెన్నైలోని ఈ కార్యాలయంలో ప్రశ్నించారు. శశికళ మేనల్లుడు జయ టివి సీవో వివేక్ జయ రామన్ నివాసంలో ఐదు రోజులుగా జరిపిన సోదాల్లో అధిక సంఖ్య ఆస్తుల దస్తావేజులు గుర్తించారు. సోదాల అనంతరం వివేక్ ను చెన్నైలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. శశికళ సోదరుడు దివాకరన్ సైతం సమానులు జారీ చేశారు. ప్రస్తుతానికి సోదాలు ముగిసినప్పటికీ మరో నాలుగు రోజులు మరింత మందికి సమన్లు జారీ చేసి విచారించనున్నారు.