"దంగల్" కు సుశీల్‌ కుమార్‌ సిద్ధం

SMTV Desk 2017-11-14 11:56:06  Sushil Kumar, wrestler, national senior wrestling tournment, indore

న్యూఢిల్లీ, నవంబర్ 14 : సుశీల్ కుమార్ యాదవ్ రెజ్లింగ్ లో భారత్ కు రెండు ఒలింపిక్స్ పతకాలు అందించిన ఘనుడు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆటకు దూరమైన ఈ మెరుపు వీరుడు, తాజాగా రేపు ఇండోర్‌లో జరగబోయే జాతీయ సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల సుశీల్‌ రైల్వేస్‌ తరఫున తన ఎంట్రీని ఖరారు చేశాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పటినుంచి అతడు ఎక్కడా పెద్దగా ఆడింది లేదు. ఈ సారి తన పునరాగమనం ఘనంగా చాటి చెప్పాలని సుశీల్‌ కుమార్‌ పట్టుదలతో ఉన్నాడు. ఈ టోర్నీ లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌తోపాటు గీత ఫోగట్, వినేశ్‌ ఫోగట్‌ కూడా ఆడనున్నారు. మరోవైపు జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తాను పాల్గొనడంలేదని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ చెప్పడం విశేషం.