ఒకే జట్టులో ఆడనున్న గేల్, మెక్‌కలమ్‌

SMTV Desk 2017-11-14 11:33:48  chris gayle, brandon macculam, bpl, rangapur riders, dhaka

ఢాకా, నవంబర్ 14 : వెస్ట్ ఇండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, కివీస్ మెరుపు వీరుడు బ్రెండన్ మెక్‌కలమ్‌ ఒకే జట్టులో ఆడనున్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వీరిద్దరి ఆట ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. అలాంటి వీరు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రంగపుర్‌ రైడర్స్‌ తరఫున ఆడనున్నారు. ఈ ద్వయం ఇంతక ముందు భారత్ లో జరిగిన ఐపీల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) జట్టులో ఆడారు. ఈ సందర్భంగా రంగపుర్‌ జట్టు కోచ్‌ టామ్‌మూడీ మాట్లాడుతూ " ఈ ఇద్దరి రాకతో మా జట్టు బలంగా మారుతుందని, నవంబర్‌ 15న మెక్‌కలమ్‌ జట్టులో వస్తాడని ఆశిస్తున్నాం. గేల్‌ ఆరు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జట్టులో చేరే అవకాశం ఉంది. ‘టీ20ల్లో ప్రారంభమే అత్యంత కీలకం. మా టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో వీరిద్దరూ రాకతో మళ్లీ పుంజుకుంటుంది" అని ఆశభావం వ్యక్తం చేశారు