స్వెట్ @ ఫోన్ పాస్ వర్డ్

SMTV Desk 2017-11-14 11:06:12  sweat pass word, smart ohone, for lock, new york

న్యూయార్క్, నవంబర్ 14 : ఇపుడున్న ప్రతి స్మార్ట్ ఫోన్ భద్రత పరంగా పాస్ వర్డ్, ప్యాటర్న్‌ లాంటి సెక్యూరిటీ ఆప్షన్స్ ను కలిగి ఉంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మరింత భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, ఐరిష్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ లాంటి బయోమెట్రిక్‌ ఆధారిత అన్‌లాకింగ్‌ సదుపాయాలను కూడా తీసుకొచ్చాయి. అయితే తాజాగా కొన్ని స్మార్ట్ ఫోన్ సంస్థలు భవిష్యత్ లో మానవ చెమటతో కూడా ఫోన్ లను అన్‌లాక్‌ చేసే విషయం పై అధ్యయనాలు చేపట్టారని సమాచారం.. చెమటతో ఎమినో యాసిడ్‌ ప్రొఫైల్‌ను తయారుచేసి దాని ద్వారా సదరు స్మార్ట్‌ఫోన్‌ యజమానికి ఫోన్‌ గుర్తించేలా అధ్యయనాలు చేస్తున్నారు. ఈ ప్రొఫైల్‌ స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్‌ అయి ఉంటుంది. దీని ద్వారా యూజర్‌ అన్‌లాక్‌ చేసుకోవచ్చట. ఈ యాప్ అందుబాటులోకి వస్తే యూజర్‌ పాస్‌వర్డ్‌లను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఆధికారి ఒకరు తెలిపారు.