అసలు ఇది ఔటేనా...!

SMTV Desk 2017-11-14 10:11:01  yuvaraj, viral vedio, social media, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 14 : క్రికెట్ లో ఔట్ అంటే, రన్ ఔట్, క్యాచ్, ఎల్బీడబ్ల్యూ, స్టంప్ ఇలా చాలా చూశాం. కానీ భారత్ క్రికెటర్ యువరాజ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంది. ఆ వీడియో లో బంతి బ్యాట్‌ను తాకలేదు, అలా అని కాళ్లపైకి రాలేదు, స్టంప్స్‌కు తాకలేదు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్‌ చేయలేదు. కానీ, అంపైర్‌ బ్యాట్స్‌మెన్‌ ఔట్‌ అయినట్లు ప్రకటించాడు. ఆసలు ఇది ఎలా ఔట్ అనే విషయం చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు.