ప్రముఖ బేస్ జంపర్ వలెరి రొజోవ్ మృతి...

SMTV Desk 2017-11-13 18:37:59  russia base jumper, valeri rojov, died in jumping, himalayas

ఖాట్మండు, నవంబర్ 13 : సాహసమే ఊపిరిగా, నిత్యం ప్రాణాలతో చెలగాటం ఆడే విన్యాసాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్యా బేస్ జంపర్ వలెరి రొజోవ్(52) శనివారం ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషాదకర ఘటన నేపాల్ లోని హిమాలయల్లో 6,812 మీటర్ల ఎత్తున్న ఆమ డాబ్లం పర్వత శ్రేణిలో చోటు చేసుకుంది. బేస్ జంపింగ్ అంటే బాగా ఎత్తైన పర్వతం లేదా కొండల మీద నుండి వింగ్ సూట్ వేసుకొని దూకడం. ఈ ప్రక్రియలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోతారు. వలెరి రొజోవ్ ఇలానే దురదృష్టవశాత్తూ చనిపోయారని ఆధికారి ఒకరు తెలిపారు. వలెరి మృతదేహం కోసం హెలికాప్టర్ సహాయంతో గాలిస్తున్నట్లు సమాచారం.