ప్రొఫెసర్ల ముందే గ్రూప్‌ మెసేజ్‌ యాప్‌తో చీటింగ్‌

SMTV Desk 2017-11-13 17:00:47  Cheating with Group Message App, Ohio University of America Students, Professors

కొలంబస్, నవంబర్ 13 ‌: తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరైనా చీటింగ్‌ చేయాలంటే ఆచితూచి బయట పడకుండా ముందు జాగ్రత్త చూపుతారు. కానీ ఏకంగా తరగతిలోని విద్యార్ధులంతా కలిసి గ్రూప్‌ మెసేజ్‌ చీటింగ్‌ చేయడం ఎక్కడైనా విన్నారా అంటే అది అమెరికా ఒహియో వర్సిటీకి చెందిన విద్యార్ధుల చిట్టింగ్ అనే చెప్పవచ్చును. అమెరికాలోని ఒహియో వర్సిటీకి చెందిన 83మంది విద్యార్థులు క్లాస్‌ వర్క్‌ చేయడానికి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఏకంగా ప్రొఫెసర్ల ముందుగానే గ్రూప్‌ మెసేజ్‌ యాప్‌తో చీటింగ్‌ చేశారు. దీనిని గమనించిన ఓ ప్రొఫెసర్ మాత్రం..అకడమిక్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విద్యార్ధుల విషయం పాలకమండలి ఎలాంటి విషయం తీసుకుంటుందో తెలియదు.