బర్త్ డే పార్టీకి మెగా ఉద్యోగ మేళా...

SMTV Desk 2017-11-13 16:41:04  MLA ROJA, YCP, NAGARI, PUTTUR,

కడప, నవంబర్ 13 : ఎవరైనా పుట్టినరోజు నాడు గుడికి వెళ్లి కేక్ కట్ చేసి, అందరితో సంతోషంగా గడుపుతారు. లేదా పేదవారికి అన్నదానం చేసి వారీ కడుపు నింపుతారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది. బర్త్ డే అంటే రాజకీయ నాయకులకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజు ఎదో ఓ కార్యక్రమం చేపడుతూ వారీ విలువైన సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తూ మార్కులు కొట్టేస్తారు. వైసీపీ పార్టీకి బలంగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు సందర్భంగా మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళాకు 40 కంపెనీలు హాజరవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేళా ఉదయం 9 గంటలకు మొదలయ్యి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. నిరుద్యోగులకు మరో గమనిక... ఉద్యోగ మేళాకు వచ్చేవారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంతో పుత్తూరులో ఆమెపై గల విశ్వాసం మరింతా పెరుగనున్నట్లు తెలుస్తోంది.