వైష్ణోదేవి దర్శనానికి ఇకపై 50వేల భక్తులకు మాత్రమే అనుమతి...

SMTV Desk 2017-11-13 16:33:08  Vaishnodevi temple, jammuKashmir, Only 50,000 devotees are permitted

న్యూఢిల్లీ, నవంబర్ 13 : దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైనా జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధిగాంచిన వైష్ణోదేవి ఆలయ దర్శనంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలు విధించింది. ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్న దేవాలయానికి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 69.34లక్షల మంది భక్తులు వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రకృతి విపత్తులు, ఉగ్రదాడి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలను కూడా నిలిపివేస్తున్నట్లు, అలాగే పరిమితికి మించిన భక్తులను అర్ధకువారీ లేదా కత్రా వద్ద వచ్చిన ఆపివేస్తామని ఎన్‌జీటీ పేర్కొంది. అందుకే ఇకపై రోజుకు 50వేల మంది భక్తులను మాత్రమే వైష్ణోదేవి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.