జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల

SMTV Desk 2017-06-11 12:39:08  State Finance Minister Rajendra, GSTC Council,Union Finance Minister Arunjit Ali,

హైదరాబాద్, జూన్ 11 : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశంలో భేటీ అయ్యేందుకు ఢిల్లీ బయలుదేరారు. జూలై 1 నుంచి వస్తు, సేవ పన్నును అమలు చేయడానికి వేగంగా అడుగులు పడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జెట్లీ నేతృత్వంలో ఢిల్లీ లో ఆదివారం సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 2016న జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 15 సార్లు కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకొని నేటి కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.