బెదిరించిన నేను బెదిరే మనిషిని కాదు...

SMTV Desk 2017-11-13 16:14:11  Silambarasan, shimbu, song, gst,

చెన్నై, నవంబర్ 13 : పెద్ద నోట్లు, జిఎస్టీ విధానాలపై పలు సినిమాలలో డైలాగులతో వివాదాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోలీవుడ్ నటుడు శింబు పాడిన పాట అదే జాబితాలో చేరిందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సామాజిక మాధ్యమంలో శింబు స్పందిస్తూ... " తట్టురోమ్ తూక్కురోమ్.. పాట ప్రజలను ఆకట్టుకుంటుంది. నాకు ఎవరి నుంచీ బెదిరింపులు రాలేదు. ఒకవేళ ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా, బెదిరిపోయే మనిషిని నేను కాదు. ఈ పాట ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరుతున్నానని " చెప్పుకొచ్చారు.