పాండ్యా లుక్...భలే కిక్...

SMTV Desk 2017-11-13 15:24:39  hardik pandya, viral photos, social media, india cricket team player

ముంబై, నవంబర్ 13 : హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టులో హాట్ ఫేవరెట్..తన ఆటతోనే కాదు..కొత్త స్టైల్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ యువతని ఫిదా చేస్తున్నాడు. తాజాగా తన కొత్తలుక్‌కి సంబంధించిన పలు ఫొటోలను ట్విటర్‌లో పెట్టగా ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి. తన కొత్త లుక్ ని అభిమానులతో పంచుకుంటూ" ఈ మార్పు చూసి భయపడకండి. మిమ్మల్ని కొత్త ఆరంభాలకు తీసుకెళ్తుంది, మిమ్మల్ని మీరు ప్రకాశవంతం చేసుకోండి’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలును చూసిన నెటిజన్లు నుండి మిశ్రమ స్పందన లభించింది. కొంత మంది బాగుందంటే, పలువురు ‘ఆటపై దృష్టి పెట్టు’ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు నుంచి మాత్రం విపరీతమైన పొగడ్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లంకతో జరిగే టెస్ట్ సిరీస్ కు పాండ్యాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.