కొత్త సంవత్సరంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా...

SMTV Desk 2017-11-13 15:21:33  assembly, CM kcr, Farmers current problems

హైదరాబాద్‌, నవంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు రూ.8వేల పెట్టుబడి సాయం వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం తరుపున అమలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో రైతుల పెట్టుడి సాయంపై చర్చ జరిపిన కేసీఆర్ మాట్లాడుతూ...సమైక్య రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని అన్నారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. విపక్షాలు అనవసర విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్‌ కోరారు. ప్రాజెక్టులు పూర్తికాకూడదు, చెరువులు నిండకూడదు, ప్రజలకు తాగునీరు అందకూడదని కోరుకుంటున్న విపక్ష పార్టీ పై ఆయన మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది తెలంగాణ రాష్ట్ర సమితేనని అందుకే రైతు సమన్వయ సమితుల్లో ఎన్నడు తెరాస కార్యకర్తలే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.