మైదానంలో ధోని, కోహ్లి పాత్ర మరువలేనిది : చాహల్

SMTV Desk 2017-11-13 14:46:55  chahal comments, on kohli, dhoni, ind-kiwis match

హైదరాబాద్, నవంబర్ 13 : ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ కోహ్లి, మాజీ కెప్టెన్ ధోని మైదానంలో తమ అమూల్యమైన సలహాలతో విజయం దిశగా జట్టుని నడిపిస్తారని యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ తెలిపారు. లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో 6, న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసి భారత్ విజయాలలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ విషయమై చాహల్ మాట్లాడుతూ " బ్యాట్స్‌మెన్‌కు నిర్భయంగా బంతులు విసిరేలా విరాట్‌ ప్రేరణ కలిగించి ఆత్మవిశ్వాసం నింపుతారని , దాడి (ఎటాక్‌) చేయడమే లక్ష్యంగా ముందుకు నడిపిస్తారన్నారు. ఇక ధోని భాయ్ మైదానంలో పరిస్థితిని చక్కగా విశ్లేషించి, వెంటనే ఏం చేయాలో చెప్తారు" అని వివరించారు