రైలు బాటకు సిద్ధమవుతున్న రామ్‌నాథ్‌ కోవింద్‌...

SMTV Desk 2017-11-13 13:50:41  President Ramnath Kovind, special Train Coaches, Abdul Kalam

న్యూఢిల్లీ, నవంబరు 13 : దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి గతంలో లాగే రెండు బోగీలు గల విలాసవంతమైన రైలు ప్రవేశపెట్టింది. 1956లో ప్రవేశపెట్టిన ఈ రైలులో రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్‌ హుస్సేన్‌, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి ప్రయాణించారు. చివరిగా 2003లో అబ్దుల్‌ కలాం ప్రయాణించారు. ఆయన తరువాత ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ రెండు అత్యాధునిక బోగీలు మంజూరు చేసింది. అందుకే ఇప్పుడు పాత బోగీల స్థానంలో జర్మన్‌ ఎల్‌బీహెచ్‌ కోచ్‌లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కోచ్‌లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయన్నారు. వీటిని అత్యాధునికంగా రూపొందిస్తామని వెల్లడించారు. చివరిసారిగా ఈ రైలులో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం బీహార్‌లోని హార్నాట్‌ నుంచి పట్నా వరకు ప్రయాణించారు.