మరోసారి చై-సామ్ రిసెప్షన్...

SMTV Desk 2017-11-13 12:31:18  chaithanya-samantha wedding, akkineni nagarjuna, hyderabad

హైదరాబాద్, నవంబర్ 13 : అక్కినేని వారింట పండుగ వాతావరణం నెలకొంది. గత నెల 6వ తేదిన గోవాలో చైతన్య, సమంతల పెళ్లి అట్టహాసంగా జరిగి౦ది. ఆ తరువాత చైతన్య అమ్మ, చై-సామ్ ల రిసెప్షన్ ఘనంగా చెన్నైలో ఏర్పాటు చేశారు. తన కొడుకు, కోడలి వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం అక్కినేని నాగార్జున, హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా స్టార్ చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్ర రావు, రాజమౌళి దంపతులు, తదితరులు హాజరయ్యారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు సినీనటులతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరై ఈ నూతన జంటను ఆశీర్వదించారు.