వంశపారంపర్యత వద్దంటున్న వరుణ్ గాంధీ..

SMTV Desk 2017-11-13 12:10:10  BJP MP Varun gandi, comments on heritary.

న్యూఢిల్లీ, నవంబర్ 13 : గాంధీ వంశకుడు, సంజయ్ గాంధీ, మేనక గాంధీ తనయుడైన వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో నేడు సాధారణ ప్రజానీకానికి అన్ని రంగాలలో అవకాశాలు కరువయ్యాయని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, వ్యాపారం ఇలా రంగం ఏదైనా వారసత్వం ఆధిక్యత కనబరుస్తున్నారని వరుణ్ వాపోయారు. తానూ 29 సంవత్సరాల వయస్సుకే ఎం.పి గా ఎంపికయ్యేందుకు గాంధీ వంశస్తుడిని కావడమే కారణమన్నారు. భారత్ లో వంశపారంపర్యత, పేర్లు చూసి అవకాశాలు పొందడమనే అలవాటు తొలగిపోవాలని తానూ కోరుకున్నట్టు వరుణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుణ్ గాంధీ.. నెహ్రూ, ఇందిరా, సంజయ్ గాంధీల వారసుడిగా రాజకీయ ప్రాధాన్యం పొందిన విషయం తెలిసిందే.