ఫ్రిజ్,ఎసిల ధరలు పెంచనున్నగోద్రెజ్..

SMTV Desk 2017-11-13 11:41:09  godrej, ac, refrigerator price high, mumbai

ముంబై, నవంబర్ 13 : ముడిపదార్థలు వ్యయాలు పెరగడంతో గోద్రెజ్ గ్రూప్ నకు చెందిన ఫ్రిజ్,ఎసిల ధరలు పెంపునకు సంస్థ సిద్ధమైంది. ఈ పెరుగుదల మూడు నుండి ఆరు శాతంగా ఉంటుదని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుండి తమ ఉత్పత్తులలో వినయోగించే కమోడిటిల ధరలు పెరగడంతో పెంపుదల అనివార్యమైందని సంస్థ బిజినెస్ హెడ్ , ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. అయితే ధరల పెరుగుదల ఈ నెల లేదా వచ్చేనెలలో అమలులోకి వస్తుందని తెలిపారు. అంతే కాకుండా గోద్రెజ్ మార్కెట్లోకి కొన్ని నూతన ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు భావిస్తోందని సమాచారం.