ఎంఎస్‌ఎంఈలను ఆదుకోండి : జైట్లీ

SMTV Desk 2017-11-13 11:37:32  psb banks, msme, jaitley, gurugram

గురుగ్రామ్, నవంబర్ 13 : ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) లు కేంద్ర ప్రభుత్వం అందించే మూలధన పెట్టుబడితో, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) లకు రుణాన్ని అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోరారు. ఆదివారం జరిగిన గురుగ్రామ్ లో జరిగిన పీఎస్‌బీ మంతన్‌’ సదస్సులో మాట్లాడుతూ" కార్పొరేట్ సంస్థల మాదిరి ఎంఎస్‌ఎంఈ లు విదేశీ రుణాలు పొందలేవని, కావున వాటికి రుణాలను ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావాలన్నారు. ప్రైవేటు పెట్టుబడులు, ఎంఎస్‌ఎంఈ ల కార్యకలాపాలు చురుకుగా ఉంటేనే వృద్దిరేటుని సాధించవచ్చని జైట్లీ తెలిపారు. అంతే కాకుండా బ్యాంకుల వాణిజ్య కార్యకలపాల్లో ప్రభుత్వం జోక్యం ఉండబోదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని మోస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)కు బడ్జెట్, రీక్యాపిటలైజేషన్‌ బాండ్లు, వాటాల విక్రయ రూపంలో వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మేర మూలధనం అందించాలని కేంద్ర సర్కారు గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.