విదేశాల్లో "హీరో" యిజం

SMTV Desk 2017-11-13 11:12:41  hero motor corp ltd, foreign investments, ceo pawan munjal, milan

మిలాన్, నవంబర్ 13 : దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ హీరో విదేశాల్లో తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం దాదాపుగా 35 దేశాల్లో హీరో సంస్థ తన వాహనలను విక్రయం చేస్తుంది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో అమ్మకాలు మెరుగుగా ఉండడంతో, ఇలాంటి మార్కెట్ లలో తమ ఉనికిని చాటుకోవాలనే ఆలోచనలో ఉందని సంస్థ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజిల్ తెలిపారు. అమ్మకాల వృద్ధి కోసం కొలంబియా, బంగ్లాదేశ్, లాటిన్ అమెరికా, కొన్ని ఆఫ్రికా దేశాల మార్కెట్ లపై పెట్టుబడులు పెట్టనున్నామని, 2020 నాటికీ 50 అంతర్జాతీయ మార్కెట్లకు తమ వ్యాపారంను విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముంజిల్ వివరించారు.