క్రికెట్ జోలికి వెళ్ళకూడదనుకున్నా: కుల్దీప్ యాదవ్

SMTV Desk 2017-11-12 17:34:14  Left arm bowler Kuldip Yadav, Sensational comments.

ముంబై, నవంబర్ 12 : టీమిండియా లెఫ్టామ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు 13 ఏళ్ళ వయసున్నప్పుడు యూపీ అండర్-15 జట్టులో స్థానం సంపాదించడానికి ఎంతగానో కష్టపడ్డానని.. ఎంత కష్టపడ్డా జట్టుకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక క్రికెట్ జోలికి వెళ్లకూడదనుకున్న క్రమంలో కోచ్ సూచన మేరకు స్పిన్ ను ఎంచుకున్నానని తెలిపారు. తనకు టీమిండియా జట్టు నుండి.. ముఖ్యంగా కోహ్లి, ధోని నుండి ఎక్కువ మద్దతు లభిస్తోందని అన్నారు.