తొమ్మిదో తరగతి బాలిక సాహసం..

SMTV Desk 2017-11-12 17:01:21  sexual harassment, 9th class girl, west godavari district.

పశ్చిమగోదావరి, నవంబర్ 12 : ప్రాణాలకు తెగించి ఓ బాలిక సామూహిక అత్యాచారం నుండి తప్పించుకొని బయటపడి౦ది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరులోని స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో విజయ్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఆ బాలిక ఎంతకీ వినకపోవడంతో అదును చూసుకొని తన ఇద్దరు స్నేహితులతో సామూహిక అత్యాచారానికి ఒడికట్టాడు. అరిస్తే చంపేస్తానని తన మెడ మీద బ్లేడ్ ను ఉంచగా.. తెగించిన బాలిక బిగ్గరగా అరుస్తూ వారి నుండి తప్పించుకొని దగ్గర్లోని వల్ల అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. వెంటనే బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.