భజ్జీ ట్వీట్ దుమారం..

SMTV Desk 2017-11-12 16:35:08  Cricketer Harbhajan Singh, twit, srilanka team.

ముంబై, నవంబర్ 12 : టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. తాజాగా శ్రీలంక టీమ్ ను ఉద్దేశించి హర్భజన్.. "జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో శ్రీలంక ఘోరమైన వైఫల్యాన్ని చవి చూసింది. తొలి ఇన్నింగ్స్ లో 200, రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేయడమే కాకుండా తన కెరియర్ లోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందని, జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉంది" అని ట్వీట్ చేశాడు. అలాగే త్వరలోనే వారు కోలుకుంటారని, తిరిగి అంతర్జాతీయ స్థాయికి చేరకుంటారన్నారు. ఇప్పుడా ట్వీట్ పై అంతర్జాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు భజ్జీ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.