ఆ అలవాటు మాకు లేదు : రాహుల్ గాంధీ

SMTV Desk 2017-11-12 15:40:02  Rahul Gandhi Comments On Modi, congress, bjp partys.

న్యూఢిల్లీ, నవంబర్ 12 : భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ అంటే తనకెంతో గౌరవమని, కాని ప్రధాని హోదాలో కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన మోదీని అగౌరవపరచాల్సిన పనిలేదన్నారు. గుజరాత్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మోదీ ఒకవేళ ప్రతిపక్షంలో ఉండి ఉంటే ప్రధానమంత్రిని అవహేళన చేసేవారని.. అలాంటి అలవాటు కాంగ్రెస్ కు లేదని తెలిపారు. తాను కేవలం బీజేపీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని వెల్లడించారు.