పాక్ టెర్రరిస్ట్ హఫీజ్‌ సయీద్‌ కు పటిష్టమైన భద్రత..

SMTV Desk 2017-11-12 15:13:42  Chief Explosion of Mumbai Blasts, JUD Chief Hafeez Saeed, Security established.

పాకిస్థాన్, నవంబర్ 12 : ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ ను అంతమొందించేందుకు ఓ విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పంజాబ్ హోంశాఖకు అధికారులు లేఖ రాశారు. హఫీజ్ ను హతమార్చేందుకు విదేశీ గూఢచార సంస్థ రూ.8 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా అమెరికా జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంతేకాకు౦డా ఆయన తలకు రూ.65 కోట్ల రివార్డును సైతం ప్రకటించారు.