గోల్డ్ మెడల్ పై స్పందించిన పూణే యూనివర్సిటీ

SMTV Desk 2017-11-12 14:28:42  Pune University, Maharshi Kirtankar Salaar Mama, gold medal issue.

పూణే, నవంబర్ 12 : గోల్డ్ మెడల్ కావాలంటే శాకాహారులై ఉండాలన్న పూణే యూనివర్సిటీ నిబంధనలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు యూనివర్సిటీ ఆ నిబంధనను తీసివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా గోల్డ్ మెడల్ కు శెలార్ కుటుంబ సభ్యులు స్పాన్సర్లుగా ఉన్నందున ఈ విషయంపై వారితో చర్చిస్తామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ వారు శాకాహార నిబంధన ఖచ్చితంగా ఉండాల్సి౦దే అని పట్టుబడితే గోల్డ్ మెడల్ ను రద్దు చేస్తామని యూనివర్సిటీ బోర్డు ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి తెర పడింది. ఇటీవల గోల్డ్ మెడల్ తీసుకోవాలంటే విద్యార్థులు వెజిటేరియన్లు, మద్యం సేవించని వారై ఉండాలనే నిబందనను విధించిన విషయం విదితమే.